ప్రైవేట్ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు : టీటీడీ
TTD| తిరుమలలో భక్తులకు అన్నదానం పేరిట విరాళాలు అందజేస్తామని వచ్చే ప్రైవేట్ సంస్థలకు విరాళాలలు ఇవ్వొద్దని టీటీడీ అధికారులు కోరారు.
తిరుమల : తిరుమలలో భక్తులకు అన్నదానం పేరిట విరాళాలు అందజేస్తామని వచ్చే ప్రైవేట్ సంస్థలకు విరాళాలలు ఇవ్వొద్దని టీటీడీ అధికారులు కోరారు. ఇలా కొన్ని సంస్థలు పెద్ద ఎత్తున్న విరాళాలు సేకరిస్తున్న ట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్ అనంతగోవిందదాస ట్రస్టుతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించా రు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నామని తెలిపారు.
తిరుమల కొండపై ఇవాళ ఆదివారం సెలవు కారణంగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. ఎంటీవీ అన్నప్రసాద భవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతుందని అధికారులు చెప్పారు.
రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు స్వామి వారి దర్శించుకునేందుకు మూడు, నాలుగు గంటల సమయం పట్టనున్నది. నిన్న తిరుమల శ్రీవారిని 82,392 మంది భక్తులు దర్శించుకోగా వీరిలో 41,800 మంది తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

