తిరుమల : వడ్డికాసుల వాడు తిరుమల వెంకన్న స్వామికి భక్తులు విరివిగా విరాళాలు అందజేస్తున్నారు. చెన్నైకి చెందిన కిరోరిమల్ కాశీరామ్ మార్కెటింగ్ అండ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు (Annadaanprasadam trust) కు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల(Tirumala) లోని ఈవో క్యాంపు కార్యాలయంలో సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర టీటీడీ ఈవో (TTD EO) ఎవి.ధర్మారెడ్డికి చెక్కును అందజేశారు.
కల్పవృక్ష వాహనంపై వేంకటేశ్వర స్వామి అలంకారంలో వేణుగోపాలుడి దర్శనం
తిరుపతి : కార్వేటినగరం వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam) భాగంగా శనివారం వేంకటేశ్వర స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఆలయ ఏఈవో పార్థసారథి, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.