తిరుమల : తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ ( TVS Motors,) ఎండీ వేణు సుదర్శన్ శుక్రవారం టీటీడీకి 16 బైక్‌లను(Electric Bikes) విరాళంగా అందజేశారు. 16 బైక్‌లలో 15 ఎలక్ట్రిక్ బైక్‌లున్నాయి. వీటి విలువ మొత్తం రూ. 22 లక్షలు. కొత్త బైక్‌లకు పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ (TTD) ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి బైక్‌ల తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో పెరిగిన రద్దీ.. అన్ని కంపార్టుమెంట్లు ఫుల్!
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని వివరించారు. .
ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం తిరుమల శ్రీవారిని 62,529 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,730 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్లుగా ఉంది.