తప్పులు చేసి పాపాత్ములుగా మిగలవద్దు : నారా భువనేశ్వరి

అమరావతి : సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, తప్పులు చేసి పాపాత్ములుగా మిగలవద్దని నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ద్వారా తిరుపతిలో 48 మంది వరద బాధితులకు లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలువాలని, వారికి సహాయ సహకారాలు అందించి మానవత్వాన్ని కాపాడాలని సూచించారు. తన తండ్రి ఎన్టీఆర్ పేదలను ఆదుకోవడంలో ముందంజలో ఉండే వారని గుర్తు చేశారు. ఆయన బాటలో తామంతా నడుస్తున్నామని అన్నారు.
వైసీపీ నేతల విమర్శలు పట్టించుకోమని, బాధపడమని అన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన వారు వాళ్ల పాపాన వాళ్లే పోతారని వ్యాఖ్యనించారు. నోటికొచ్చినట్లు ఆడవాళ్లపై మాట్లాడొద్దని, సమాజానికి ఉపయోగం లేని విమర్శలెందుకని అన్నారు. అతిపెద్ద రాష్ట్రాన్ని నా భర్త ఏ విధంగా అభివృద్ధి చేశారో నాకు తెలుసని, రాత్రింబవళ్లు నిద్రలేకుండా పని చేశారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరవతే ఉండాలని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

