అమరావతి : మరో రెండు రోజుల్లో జరుగనున్న క్రిస్మస్ వేడుకల్లో ఉత్సహంగా పాల్గొనేందుకు సిద్ధమవుతున్న చిన్నారులు ప్రమాదానికి లోనయ్యారు. ఏలూరు జిల్లా నత్తగుళ్లపాడు చర్చిలో ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నారు.దీంట్లో భాగంగా గురువారం ఉదయం సన్నాహక కార్యక్రమంలో వంట చేస్తుండగా సిలిండర్ పైప్ ఊడి మంటలు వ్యాపించాయి. సమీపంలో నృత్య ప్రదర్శనకు సన్నాహమవుతున్న చిన్నారులకు మంటలు అంటుకున్నాయి. గాయపడ్డ ఐదుగురు చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.