అమరావతి : పల్నాడు జిల్లా దాచేపల్లి (Dachepally) నగర పంచాయతీ పరిధిలోని అంజనిపురం కాలనీలో అతిసారం(Diarrhea) ప్రభలి మరో ఇద్దరు మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం కారణంగా గ్రామస్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజాగా గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వీరయ్య, వెంకటేశ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. విషయం తెలుసుకున్న పట్టణ అభివృద్ధిశాఖ మంత్రి నారాయణ(Minister Narayana) జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
దాచెపల్లిలోని నీటిని విజయవాడ ల్యాబ్‌కు పంపించాలని ఆదేశించారు. బోర్లను అన్నింటిని మూసివేసి వాటర్ ట్యాంక్‌ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందించాలని అన్నారు. మురికి కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించాలని ఆదేశించారు. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు జరిపి వైద్యం అందించాలని సూచించారు.