అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుల కార్యాల యం వద్ద కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ,పార్ట్‌టైం ఉద్యోగులు విజయవాడలో ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన ఉద్యోగం ఇవ్వాలని , డీఏ, హెచ్ఆర్ఏ సౌకర్యం కల్పించాలని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ విధానా లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల ధర్నాకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
అతితక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులకు జీవోనెంబర్ 5 ప్రకారం మినిమమ్ టైం స్కేలు జీతాలు ఇవ్వాలని కోరారు. కేంద్రం అందిస్తున్న నిధులను ఉద్యోగుల సంక్షేమానికి వాడకుండా జగనన్న విద్యా కానుక పేరిట పాఠశాలల్లో విద్యార్థులకు బూట్లు ,బ్యాగ్‌లు, సాక్స్‌లు కొనుగోలు చేయడం దారుణమని సంఘం నాయకులు ఆరోపించారు.