అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టు సీబీఐ కస్టడీకి అనుమతిచ్చింది. వివేకా హత్యకేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై వాదనలువిన్న న్యాయస్థానం 7 రోజుల కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 2వ తేదీ వరకు శివశంకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనుంది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నాడు. వివేకా హత్యకు సంబంధించి శివశంకర్‌రెడ్డి సీబీఐ విచారణలో ఏం చెబుతారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.