నంద్యాల : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలానికి ( Srisailam Temple) వచ్చిన యాత్రికులకు సైబర్ నేరగాళ్లు ( Cyber Crimes ) మోసం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన 27 మంది యాత్రికులు ( Delhi Pilgrims ) శ్రీశైలం మల్లికార్జున సదన్ పేరుతో ఆన్లైన్లో వసతి కోసం సంప్రదించగా సైబర్ నేరగాళ్లు 9 ఏసీ గదుల కోసం రూ.15 వేలు ఆన్లైన్లో తీసుకున్నారు.
ఈ సందర్భంగా హైదరబాద్ నుంచి పర్యాటక బస్సులో శ్రీశైలం వెళ్లిన 27 మంది ఢిల్లీ వాసులు మల్లికార్జున సదన్‌లో గదుల కోసం సంప్రదించగా మోసానికి గురైనట్లు గుర్తించి ఆలయ ఈవో దృష్టికి తీసుకొచ్చారు. దీంతో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు యాత్రీకులకు అండగా నిలిచి ఉచిత వసతి, భోజనం, దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల నుంచి లికిత పూర్వక ఫిర్యాదును స్వీకరించి సైబర్‌నేరగాళ్ల మోసంపై కేసు పెట్టాలని అధికారులకు సూచించారు.