విజయవాడ : తిరుమల (Tirumala) పవిత్రతను కాపాడేందుకు అన్యమతస్థులు ఎవరైనా స్వామివారి దర్శనం కోసం వస్తే నిబంధనల ప్రకారం డిక్లరేషన్(Declaration) ఇవ్వాల్సిందేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల (APCC Chief YS Sharmila) స్పష్టం చేశారు. తిరుమలలో లడ్డూ వివాదం, డిక్లరేషన్ అంశాలపై ఆమె స్పందించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని, ‘ రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్’ అని వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగిందనే విషయం చంద్రబాబుకు తెలుసని, సాక్ష్యాలు, రిపోర్టులు ఉన్నా నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ పశ్చాత్తాప దీక్ష , మాజీ సీఎం జగన్ ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
ఒకరిపై ఒకరు పోటీ పడి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తిరుమల లడ్డూను కల్తీ చేసిందని ఆరోపించారు. మార్కెట్ కంటే తక్కువకే నెయ్యి కొనుగోలు చేయండంతో సరఫరాదారులు కల్తీ నెయ్యిని సరఫరా చేశారని విమర్శించారు.