తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సంక్రాంతి(Sankranthi) పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సెలవు దినం ప్రకటించడంతో గత మూడురోజులుగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలిపిరి (Alipiri) మెట్ల మార్గాల వేలాది మంది భక్తులు గోవిందానామస్మరణతో కాలినడకన ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తుల రాక వల్ల కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోగా ఏటీసీ వరకు క్యూలైన్లో నిలబడిఉన్నారు.
ఆదివారం 86 వేల 107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా నిన్న సోమవారం 80,964 మంది దర్శించుకున్నారు. 27,657 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.89 కోట్లు ఆదాయం(Hundi Income) వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని పేర్కొన్నారు.