అమరావతి : చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం (Kanipakam)లో ఆలయ అధికారులు భక్తుల కోసం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. క్యూలైన్లలోని భక్తులకు బిస్కెట్లు ( Biscuits ), బాదంపాలు ( Almond ) పంపిణీ చేసే కార్యక్రమాన్ని నూతన సంవత్సరం ( New Year) సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. ఇకపై ప్రతినిత్యం వీటిని పంపిణీ చేస్తామని ప్రకటించారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి అలసిపోయే అవకాశముందని, వారి సౌకర్యం కోసం నూతన విధానాన్ని ప్రారంభించామని ఈవో పేర్కొన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా స్వామివారిని దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ (MLA Muralimohan) స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లను పరిశీలించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.150 దర్శన కూలైన్లను ఏర్పాటు చేశామని ఈవో పేర్కొన్నారు.