Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగానే నష్టాల్లోకి నెట్టి. అమ్మేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.
ఇప్పటికే వైజాగ్ స్టీల్‌లో రెండు ప్లాంట్లను మూసివేశారని, మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారని రామకృష్ణ తెలిపారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కారు చౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోందని అన్నారు. వైజాగ్ స్టీల్‌కు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు.