హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం సీపీఐ ఉద్యమం చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమస్యల పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఆదివా రం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సమావేశమవడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. బీహర్ సీఎం నితీశ్‌కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నదని, వీరు ప్లేట్ ఫిరాయించకుండా మోదీ పట్టుకున్నారని పేర్కొన్నారు.