(Covid cases in AP) ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో 840 కొత్త కేసులు బయటపడటంతో ప్రజలు కలవరానికి గురవుతున్నారు. మరోవైపు టీకాలు కూడా అంతే వేగంగా వేస్తున్నారు. అయినా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో రాష్ట్రంలో 37,553 మంది శాంపిల్స్ ను పరీక్షించగా.. వారిలో 840 మందికి కరోనా నిర్థారణ అయింది. వీటిలో ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 175, విశాఖలో 174 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఇక ఇదే సమయంలో 150 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అవగా.. ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్ మరణాల సంఖ్య 14,503 కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,80,602 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20,62,440 మంది కరోనా నుంచి కోలుకున్నారు.