Tirumala |తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. వేంకటేశ్వర ఆలయానికి వచ్చిన ఓ కొత్త జంట వెడ్డింగ్ ఫొటోషూట్ కలకలం రేపింది. బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న జంట గొల్లమండపానికి అతి సమీపంలో ఫొటోషూట్లో పాల్గొన్నారు. ప్రత్యేక లైట్ల వెలుగులో ఈ ఫొటోషూట్ జరగ్గా.. నుదుటిపై ముద్దులు పెట్టుకుంటుండగా వీడియోలు, ఫొటోలు తీశారు. అలాగే గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు నడస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, భక్తులు మండిపడుతున్నారు.
తిరుమలలో ఫొటోషూట్లు, రీల్స్ చేయడం నిషేధం. అయినప్పటికీ కొంతమంది ఆలయ పవిత్రతతను దెబ్బతీస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి చేసిన రీల్స్ కూడా గతంలో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఫొటోషూట్లు, రీల్స్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు. పదే పదే అధికారులు హెచ్చరిస్తుప్పటికీ.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం చర్చనీయాంశంగా మారింది.
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో వివాదంగా మారిన కొత్త జంట ఫోటో షూట్
గొల్లమండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగడంపై భక్తులు ఆగ్రహం
తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై వెలువడుతున్న… pic.twitter.com/pCQq4VQR4t
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2026