తిరుపతి : తిరుపతి కలెక్టరేట్ ఆవరణలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది . సూళ్లూరుపేట సాయినగర్కుచెందిన నాగార్జున, భవాని అఘాత్యానికి పాల్పడ్డారు. పాసు పుస్తకాల జారీలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ భవాని పురుగు మందు తాగగా, నాగార్జున చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక పోలీసులు ఇరువురిని రుయా ఆస్పత్రికి తరలించారు.
కొన్ని నెలల క్రితం ముఖ్యమంతికి తమ సమస్యను పరిష్కరించాలని కోరినా, జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇవాళ స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు మరోసారి విన్నవించేందుకు వచ్చి ఈ ఘటనన పాల్పడ్డారు. పాస్ పుస్తకానికి ఆర్ఐకి డబ్బులిచ్చినా ఫలితం లేకుండాపోయిందని బాధితులు ఆరోపించారు.