అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 335 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు చలా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ముగ్గురు వ్యక్తులు కరోనాతో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్‌తో మరణించారు.
ఒక్కరోజు వ్యవధిలో 936మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల్లో 19,241 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,29,77,640 కు చేరుకున్నది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,16,585 గా ఉన్నది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,94,818 కాగా, రాష్ట్రంలో 6,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,713కి పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. రోజురోజుకి కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే అంశం అని వైద్య నిపుణులు అంటున్నారు.