తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాస్వామివారికి రూ.1.20 లక్షల విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభరణాలను మంగళవారం ఆలయ పరిచారకులు కానుకగా సమర్పించారు. ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడికి వీటిని అందజేశారు.
ఇందులో ఉత్సవమూర్తులకు అలంకరించే ఆరు కిరీటాలు, 12 కర్ణ పత్రాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ కామరాజు, ఆలయ అర్చకులు, పరిచారకులు పాల్గొన్నారు.