తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 16 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 62,725 మంది భక్తులు దర్శించుకోగా 30,172 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.85 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
ప్రకాశం జిల్లా అనగర్ల పూడికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు సి పి వెంకటేష్ అన్న ప్రసాదం ట్రస్టు కు రూ 1.10 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి చెక్కు అందించారు. హైదరాబాదులో స్థిరపడిన వెంకటేష్ తెలంగాణ రాష్ట్రం తరపున అండర్ 19 మ్యాచ్ ఆడారు.ఇందుకు గాను బీసీసీఐ అతనికి రూ 1.10 లక్షల పారితోషికం అందించింది. తన మొదటి చెక్కును తిరుమల స్వామి వారికి విరాళంగా అందివ్వాలనే ఉద్దేశ్యంతో తన తండ్రి విజయ్ తో కలసి చెక్కు ను చైర్మన్కు అందించారు.