తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల ( Tirumala )కు చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం సెలువు దినం కావడంతో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 69,232 మంది భక్తులు దర్శించుకోగా 26,536 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income ) రూ. 3.22 కోట్లు వచ్చిందని తెలిపారు.