అమరావతి : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం(Pithapuram) జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేయనున్నారు. ఈ మేరకు ఆయనే గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లేనని , ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందని స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలంలో జనసేన(Janasena) ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన పవన్‌కల్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
గతంలో గాజువాక, భీమావరం నుంచి పోటీ చేశానని తెలిపారు. పాపం జగన్‌కు గ్రాఫిక్స్ (Jagan Graphics) పై అవగాహన లేదని దుయ్యబట్టారు. నన్ను కొట్టే ప్రతి దెబ్బను వాడుకుని ఎదుగుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతున్నామని ధీమాను వ్యక్తం చేశారు. జగన్ పోతాడు.. వైసీపీ పోతుంది. పొత్తులు గెలుస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రతినెలా జనవాణి నిర్వహిస్తామని ప్రకటించారు.