అమరావతి : పంట పెట్టుబడి కోసం చేసిన అప్పు తీర్చాలని వేధింపులు భరించలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య(Constable suicide ) చేసుకున్న ఘటన నెల్లూర్ (Nellore) జిల్లాలో చోటు చేసుకుంది . ఏఎస్‌పేట మండల పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న రమేశ్(Ramesh) అనే కానిస్టేబుల్ పంట వేసుకునేందుకు వైసీపీ జడ్పీటీసీ భర్త ప్రసాద్‌గౌడ్ వద్ద అప్పు తీసుకున్నాడు.
ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోవడం (Crop Damage) తో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో పాటు అప్పు ఇచ్చిన ప్రసాద్‌గౌడ్ నుంచి ఒత్తిళ్లు రావడంతో సొంత నివాసమైన సంగం మండలం పడమటిపాలెంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రసాద్‌గౌడ్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.