ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్య మతస్తుడే అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. డిక్లరేషన్‌పై జగన్ సంతకం ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. ఎడమ చేతితో సంతకం చేయి.. ఎంతో మంది సంతకాలు పెట్టి పోయారని వ్యాఖ్యానించారు.
మానవత్వం గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. సొంత ఎంపీ రఘురామకృష్ణ రాజును కొట్టించడమేనా మానవత్వం, ఇదేనా ప్రేమ అని చింతా మోహన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని తెలిపారు. అయినప్పటికీ ఇంకా భక్తులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌పై మండిపడ్డారు. లడ్డూ వ్యవహారంతో జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని విమర్శించారు. ఇప్పటికైనా తిరుమల లడ్డూ వ్యవహారంలో సైలెంట్‌గా ఉండమని హితవు పలికారు.
దళితులపై ప్రేమ కురిపిస్తూ జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. దళితులపై అంత ప్రేమ ఉంటే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఎందుకు మూసివేశావని ప్రశ్నించారు. స్కాలర్షిప్లను ఎందుకు ఆపేశావని నిలదీశారు.