అమరావతి : వైసీపీని (YCP) రాజకీయంగా దెబ్బతీయడానికి తమ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న దాడులు, సోషల్ మీడియాలో ( Social media) తప్పుడు పోస్టింగుల పేరిట వైసీపీ కార్యకర్తలపై పెడుతున్న కేసులు మానుకోవాలని కోరుతూ డీజీపీకి ( DGP ) ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు ఆదిమూలపు సురేష్ ( Suresh ), అంబటి రాంబాబు (Ambati Rambabu ) మీడియాతో మాట్లాడారు. అక్రమ అరెస్టులపై కోర్టులు పోలీసులకు మొట్టికాయలు వేశారని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులపై న్యాయస్థానం ప్రైవేట్ కేసులు (Private Case ) వేస్తామని అన్నారు. వైఎస్ జగన్, కుటుంబ సభ్యులపై ఇష్టమొచ్చిన విధంగా అసభ్యకరంగా పోస్టులు పెడుతూ వారిపై చర్యలు తీసుకోవాలని, వారిపై విచారణ చేయాలని డీజీపీని కోరినట్లు తెలిపారు.
తమ కార్యకర్తలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా రోజుల తరబడి స్టేషన్లో ఉంచి వేధిస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులను సస్పెండ్ చేసేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.