లాక్డౌన్ సమయంలో చేతికి ఎముక లేదన్నట్టు సగటు మానవుడికి సాయం చేసుకుంటూ వచ్చిన రియల్ హీరో సోనూసూద్. సాయం అడగాలే కాని లేదనకుండా ఆదుకున్నాడు సోనూ. సినిమాలలో విలన్ పాత్ర పోషించినప్పటికీ, రియల్ లైఫ్‌లో మాత్రం హీరోయిజం ప్రదర్శించారు. సోషల్ మీడియా ద్వారాను సోనూసూద్‌కు చాలా రిక్వెస్ట్‌లు వస్తుంటాయి. వాటన్నింటిని బదులిస్తూ సాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనూసూద్ ఫాలోవర్స్ సంఖ్య 6 మిలియన్స్‌కు చేరుకుంది. 60 లక్షల అభిమానాన్ని సొంతం చేసుకున్న సోనూసూద్‌కు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇదిలా ఉంటే రీసెంట్గా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 10 ఆక్సిజన్ సిలిండర్ల దానంతో తన వంతుగా సోనూ సాయం చేశారు. ప్రస్తుతం సోనూసూద్ .. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు.