అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 మంది కలెక్టర్లను బదిలీ ( Collectors Transfer ) చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్‌గా రామసుందర్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూర్ కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా , పల్నాడు కలెక్టర్‌గా కృతిక శుక్లా, బాపట్ల కలెక్టర్‌గా వినోద్ కుమార్, ప్రకాశం కలెక్టర్‌గా రాజాబాబు, నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్సు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిషాంత్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా ఎ. సిరి, అనంతపురం కలెక్టర్‌గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్‌ను నియమించింది.