Srisailam | భ్రమరాంబికా దేవి అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ప్రతి మంగళ, శుక్రవారాల్లో శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి కొబ్బరికాయలతో కుంభోత్సవం నిర్వహిస్తారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ఏ రోజు ముందు వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారికి సాత్విక బలి నిర్వహించడానికి (కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలు తదితరాలు) తో ఈ కుంభోత్సవం జరపడం ఆనవాయితీ. కుంభోత్సవం నాడు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియగానే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం (29.03.2024) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలు రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించారు. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు, సహాయ ఈఓ ఎం హరిదాసు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

