హైదరాబాద్ : టీడీపీ సీనియర్‌నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(72) గుండెపోటుతో మృతి చెందిన సగతి తెలిసిందే. ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బొజ్జల రామకృష్ణారెడ్డి మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో తనతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ సహచరున్ని, ఆత్మీయ మిత్రున్ని కోల్పోయానని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జలను ఆయన నివాసానికెళ్లి పరామర్శించిన జ్ఞాపకాలను కేసీఆర్ స్మరించుకున్నారు. బొజ్జల మరణం పట్ల ఆవేదన చెందిన సీఎం కేసీఆర్.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.