Srisailam | చంద్రగ్రహణం కారణంగా శ్రీశైల ప్రధానాలయంతోపాటు పరివార దేవతాలయాలలో గ్రహణ విడుపు కాలం తరువాత శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి చేశామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి సంప్రోక్షణ చేశారు.
ఆ తర్వాత స్వామి అమ్మ వార్లకు మంగళవాయిద్యాలతో సుప్రభాతసేవ, మహా మంగళ హారతులు, ప్రదోషకాల పూజలు నిర్వహించారు. కాగా రాత్రి ఎనిమిది గంటల నుండి స్వామివారి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు కల్పించారు.
అమ్మవారి ఆలయ సంప్రోక్షణ కొనసాగుతున్నట్లు ఈవో లవన్న చెప్పారు. గ్రహణం కారణంగా నిలుపుదల చేసిన పరోక్ష సేవలు, ఆర్జిత సేవలతోపాటు గర్బాలయ అభిషేకాలు, స్పర్శదర్శనాలు యథాతథంగా భక్తులకు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానాలయంలోని పరివార దేవతాలయాలతోపాటు సాక్షిగణపతి, హఠకేశ్వరం, ఫాలధార – పంచధార, శిఖరేశ్వరం ఉపాలయాల్లోనూ నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని చెప్పారు.