అమరావతి : ఏపీ ప్రభుత్వంపై నటుడు చిరంజీవి(Actre Chiranjeevi) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వరుస కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya saireddy) చిరంజీవి వ్యాఖ్యలపై ట్విటర్ (Twitter) వేదిక ద్వారా విరుచుకుపడ్డారు.
సినీ రంగమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. పరిశ్రమలోని పేదలు,కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వాళ్లూ మనుషులే. వారి గురించి మీకెందుకు. వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాలు పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన పేర్కొన్నారు.