అమరావతి : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా రాజకీయ పార్టీల్లో చేరికలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) మంగళవారం జనసేన (janasena) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరగా ఆయనకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరో సినీనటుడు పృథ్వీరాజ్ కూడా జనసేన పార్టీలో చేరారు. ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో పృథ్వీరాజ్ తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ టీవీ ఛానల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఆయనను పార్టీ నుంచి దూరంగా ఉంచారు.