అమరావతి : సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసలు సమస్యలు వదిలేసి సినిమా పరిశ్రమ (Cine Industry) పై పడ్డారని ఆరోపించారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్లో చిరంజీవి ప్రభుత్వంపై పరోక్ష ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలోని కొందరు పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా సినిమా పరిశ్రమపై పడడం శోచనీయమని అన్నారు.
రాష్ట్రంలో అసలు విషయాలు వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు (projects) , పేదవారికి కడుపు నింపే విషయం గురించి ఆలోచించాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టిని సారించాలని, పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని చిరంజీవి పేర్కొన్నారు . పవన్ కల్యాణ్ బ్రో(Bro Movie) రెమ్యునరేషన్‌పై ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati) లేవనెత్తిన అంశాలకు చిరంజీవి కౌంటర్ ఇచ్చారు.