AP News | మిరప మొక్కకు మిరప కాయలు మాత్రమే కాకుండా.. టమాటాలు, వంకాయలు కూడా కాస్తే ఎలా ఉంటుంది. మన పొరుగు రాష్ట్రమైన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఈ అద్భుతం జరిగింది. మిరప చెట్టుకు టమాటాలు, వంకాయలు కూడా కాస్తున్నాయి. ఇప్పుడు ఈ వింత మొక్క ఆంధ్రాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడుకు చెందిన రైతులు ముత్యాల రజిత రమేశ్ తన పొలంలో మిరప పంట సాగు చేస్తున్నాడు. అయితే రమేశ్ పొలంలోని ఓ మిరప మొక్కకు టమాటలు, వంకాయలు కూడా కాయడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చూసిన పక్క పొలాల రైతులు కూడా అవాక్కయ్యారు. దీని గురించి మాట్లాడుకుంటూ ఉండటంతో ఆ నోటా ఈ నోటా ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలిసింది. దీంతో అందరూ ఈ అరుదైన మొక్కలను చూసేందుకు జనాలు రమేశ్ పొలానికి తరలివస్తున్నారు.
కొంతమంది అయితే ఈ మొక్క వీడియోను తీసి సోషల్‌మీడియాలో కూడా పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వింత మొక్కపై జగ్గయ్యపేట డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి బాలాజీ స్పందించారు. ఒక్కే మొక్కకు మూడు రకాల కాయలు కాయడం వెనుక జన్యుపరమైన మార్పులే కారణం అయ్యి ఉంటుందని తెలిపారు. మిరప, టమాట, వంకాయ ఈ మూడు కూడా సొలనేసి అనే వృక్ష కుటుంబానికి చెందినవని.. అందువల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉంటుందని వివరించారు.
మిరప చెట్టుకు వంకాయలు, టమాటాలు..!
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తకెళ్లపాడులో చోటు చేసుకున్న వింత
స్థానికంగా నివసించే ముత్యాల రజిత, రమేశ్ తోటలో మిరప చెట్టుకు కాసిన వంకాయలు, టమాటాలు
విషయం తెలుసుకుని వచ్చి చూసి, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న స్థానికులు pic.twitter.com/BCFVECr3ct
— BIG TV Breaking News (@bigtvtelugu) November 8, 2025