తిరుమల : తిరుమలలో చిరుత కలకలం సృష్టించింది. రెండో ఘాట్‌రోడ్డులో విధులకు వెళ్తున్న ఆనంద్, రామకృష్ణ అనే ఎఫ్ఎంఎస్ సిబ్బందిపై వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేయగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది అంబులెన్స్‌లో హుటాహుటిన తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు.
చిరుత దాడిలో ఇద్దరు ఎఫ్ఎంఎస్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని తిరుమల వీజీవో బాలారెడ్డి పేర్కొన్నారు. చిరుత రోడ్డు దాటే క్రమంలో ఇద్దరు బైక్‌పై రావడంతో సంఘటన జరిగి ఉండొచ్చన్నారు. చిరుత పులుల సంచారం శేషాచల అటవీ ప్రాంతంలో ఎక్కువైందని, ప్రయాణ సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భయంతోనే చిరుత దాడికి దిగి ఉంటుందని, సాధారణంగానైతే మనుషులపై దాడి చేయవన్నారు.