అమరావతి : వైసీసీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా (Resignation) అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటన ( Davos tour ) వివరాలను చంద్రబాబు శనివారం మీడియాకు వివరించారు. అనంతరం విజయసాయి రెడ్డి రాజీనామా అంశంపై స్పందించారు.
సాయిరెడ్డి రాజీనామా పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. పార్టీపై నమ్మకం ఉంటే ఉంటారు. లేకపోతే పోతారని వ్యాఖ్యనించారు. వైసీపీ పరిస్థితికి ఇది అద్దం పడుతుందని తెలిపారు. రాజకీయ పార్టీల్లో ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయని అన్నారు.
జగన్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు ( Parliament Member) విజయసాయి రెడ్డి(Vijayasai Reddy ) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ (Chairman Dhakad) కు శనివారం అందజేశారు. నిన్న సాయంత్రం తాను పొలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.
ఇది ఏ పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని తెలిపారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పే నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని విజయసాయి రెడ్డి తెలిపారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. తనను ఎవరూ ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు.