అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళనల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాం ధ్ర అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదని అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ కావాలనే రైతులను రెచ్చగొడుతుందని విమర్శించారు.
రాష్ట్రంలో అశాంతి సృష్టించి, లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానులు తమ పార్టీ నిర్ణయమని అంతిమంగా అదే నిజమవుతుందని అన్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.