అమరావతి : తన తమ్ముడు నారా రామూర్తినాయుడు(Ramurtinaidu) మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని శనివారం నేరుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రామ్మూర్తినాయుడు నన్ను విడిచి వెళ్లిపోయాడని శోకతప్త హృదయంతో తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాజీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు చేశాడని , మా నుంచి దూరమై కుటుంబంలో విషాదం నింపాడని, రామూర్తినాయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని వివరించారు.
రామూర్తినాయుడు మృతిపట్ల మంత్రి నారా లోకేష్(Lokesh) , మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి , అనగాని సత్యప్రసాద్, డీబీవీ స్వామి , అచ్చెన్నాయుడు, నారాయణ ప్రగాఢ సానుభూతిని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిన్నాన్న రామూర్తినాయుడు మరణం తీవ్ర విషాదం నింపిందని లోకేష్ అన్నారు. పిన్ని, తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి : పవన్‌కల్యాణ్
నారా రామూర్తినాయడు ఆత్మకు శాంతి చేకూరాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawankalyan) అన్నారు. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.