అమరావతి : ఏపీ కేబినెట్లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ఉత్తుత్తి సమావేశాలు ఎందుకని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) ఏపీ ప్రభుత్వానికి సూచించారు. పోర్టులు, భూములు ( Ports and Lands ) తమ వారికి కట్టబెట్టడానికే చంద్రబాబు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సాయికృష్ణ లాకప్‌డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య, ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తల దాడి గురించి ఎందుకు చర్చించ లేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని నిలదీశారు.
తీవ్రవాదుల మీద పెట్టాల్సిన చట్టాన్ని అమాయకులపై పెట్టడం దారుణమని అన్నారు. కూటమికి చెందిన నాయకులు జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేయాలేదని ఆరోపించారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబుకు భయమని అన్నారు. కేబినెట్ సమావేశానికి డీజీపీ వెళ్లి సోషల్ మీడియా కట్టడిపై మాట్లాడడం విచిత్రమని వెల్లడించారు.