అమరావతి : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandra Babu) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో సినీరంగంలో ఎన్నో విజయాలను అందుకున్నారని చిరంజీవిని కొనియాడారు. ఎన్నో అద్భుత పాత్రలు పోషించిన ఆయన వెండితెర ఆణిముత్యమని , తరాలు మారినా చెక్కుచెదరని ప్రేక్షకాభిమానం ఆయన సొంతమని అన్నారు.
చిరంజీవి స్థాపించిన ఐ బ్యాంక్(Eye Bank), బ్లడ్‌బ్యాంక్(Blood Bank) లు ఆయన మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. చిరంజీవి మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు.
అన్నయ్యకు తమ్ముడు శుభాకాంక్షలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 69వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు ఘనంగా బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవికి తమ్ముడు, నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు గురువారం తెలిపారు.
నా దృష్టిలో అన్నయ్య చిరంజీవి ఆపద్బాంధవుడు.. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఆయన ఎంతోమందికి సాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కావాల్సిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్థిస్తారు.
జనసేనకు రూ.5 కోట్ల విరాళాన్ని అందజేసి, ఆయన ఇచ్చిన నైతిక మద్దతు అఖండ విజయాన్ని అందించింది. గొప్పదాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి సదా కృతజ్ఞుడిని. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.