అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu ) ఏనాడు కూడా చెప్పింది చేయడని మాజీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) విమర్శించారు. గత ఎన్నికల్లో సంపద ( Wealth ) సృష్టించి పేదలందరికీ పంచి పెడుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బాబు మాట మార్చారని ఎద్దేవా చేశారు.ఆయన నేడు సంతానమే సంపద అని అంటూన్నారని విమర్శించారు.
ప్రజలు ముగ్గురిని, నలుగురిని కనమని చెప్తున్నాడని అన్నారు. ముగ్గురిని కంటే ముప్పైవేలు, నలుగురిని కంటే నలభై వేలు ఇస్తామని మోటివేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు మాత్రం ఒకరినే కన్నారని ఎద్దేవా చేశారు. ఎక్కువ మంది పిల్లలు ఉంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
ప్రజలు పేదరికంలోనే ఉండాలా. వారికి ఇంగ్లిష్ చదువులు వద్దు, వారి బ్రతుకులు ఎప్పుడు చిరిగిపోయే ఉండాలని చంద్రబాబు ఆలోచన అని ఆరోపించారు. సూపర్ సిక్స్, సెవన్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారని జగన్ వివరించారు.