అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కల్తీసారా బాధిత కుటుంబాలను పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని బాధిత ఇళ్లకు ఇంటింటికి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. సారా కారణంగా మరణించిన కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. సారా వల్ల మరణించిన 26 మంది కుటుంబాలకు లక్ష చొప్పున సాయం అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఏపీలో మద్యం, నాటుసారా ఏరులై పారుతుందని ఆరోపించారు.
వైసీపీ నాయకులే కల్తీ సారాను తయారి చేస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి ఏపీలో అధిక ధరలకు విక్రయిస్తుందని మండిపడ్డారు. మద్య నిషేదం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని, ఎంతమందిని జైల్లో పెట్టినా భయపడేది లేదని అన్నారు.