అమరావతి : తిరుమల ,తిరుపతిలో తొక్కిసలాట ( Stampade) కూటమి ప్రభుత్వ వైఫల్యమని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కన్నబాబు (Former minister Kannababu) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యుడై క్షమాపణలు చెప్పాల్సింది చంద్రబాబే (Chandrababu) నని అన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధితులకు డబ్బులిచ్చారంటూ దేవాదాయ శాఖా మంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
చంద్రన్న కానుక ఇస్తానంటూ సంక్రాంతి కానుక ఇవ్వలేదని, పెద్ద పండుగ ప్రజలకు రాలేదని, కూటమి నాయకులకు దోచుకోవడానికి పండుగ వచ్చిందని ఆరోపించారు. టీటీడీ సమావేశంలో ప్రైవేటు వ్యక్తులను కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడతామని టీడీపీకి సేవలు చేసిన కంపెనీలను తెచ్చి టీటీడీ పాలకమండలి సమావేశాల్లో కూర్చోబెట్టారని ఆరోపించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అడ్రస్ లేని సంస్థలతో టీటీడీ ఏఐ ప్రాజెక్టులు చేపడుతుందా? అంటూ నిలదీశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఒక్క పథకాన్నీ అమలు చేయలేదని వెల్లడించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా ధరలు ఏ మాత్రం తగ్గించలేదని విమర్శించారు. కరెంట్ నుంచి బస్సు ఛార్జీల వరకు దెబ్బ మీద దెబ్బ కొట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు హ్యపీ సండే అంటున్నారు. ప్రజలు ప్రతిరోజూ హ్యాపీగా ఉండేలా చూడమని మేం కోరుతున్నామని సూచించారు.