అమరావతి : రాష్ట్రాన్ని దోచుకుతిన్న చంద్రబాబు(Chandra Babu), లోకేష్‌తో పాటు వారికి సహకరిస్తున్న వారు వైట్ కాలర్ క్రిమినల్సే నని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు వాటి నుంచి తప్పించుకోవడానికి కింది స్థాయి నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు కోర్టులను ఆశ్రయిస్తూ మేనేజ్ చేస్తున్నారని వ్యాఖ్యనించారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని కోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని జోస్యం చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ (Skill Development Case) కేసులో సుప్రీం కోర్టు నుంచి తప్పించుకోవాలని చూసిన చంద్రబాబుకు చుక్కెదురయ్యిందని అన్నారు. చట్టానికి అందరు సమానులేనని గతంలో ముఖ్యమంత్రులు జయలలిత, సుబుసోరేన్ను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ చట్టం నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని తెలిపారు. దోచుకున్న డబ్బును చంద్రబాబు నుంచి ఎలాగైనా రాబట్టడానికి జగన్ వేసులు వేశారని పేర్కొన్నారు.
టీడీపీ అధినేతకు రాబోయే రోజుల్లో రాజకీయంగా నూకలు చెల్లాయని అన్నారు. 2019లో టీడీపీని ఏపీ ప్రజలు వాష్ చేసినట్లుగానే 2024లోనూ చంద్రబాబు అలయెన్స్ పార్టీలు వాష్ అవుతారని వెల్లడించారు. వైఎస్సార్సీపీని ఓడించే సత్తాలేక, ప్రతి ఒక్కరితో చంద్రబాబు పొత్తుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. అవినీతికి మద్దతు పలుకుతున్న పవన్ క్యలాణ్ కూడా అవినీతిపరుడేనని విమర్శించారు.