అమరావతి : అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఎన్నడూ పట్టించుకోని చంద్రబాబు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. రాష్ట్రంలో మాఫియాను ఏర్పాటు చేసుకుని బీసీ డిక్లరేషన్(BC Declaration) అంటూ మాట్లాడుతున్నారని విమర్షించారు.
మరుగుదొడ్ల విషయంలో కూడా జన్మభూమి కమిటీ (Janamabhoomi Committe)ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. జన్మభూమి ద్వారా మళ్లీ కమిటీలు తీసుకువస్తారా అంటూ వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి అవకాశాలు రాని వారే పార్టీలు మారుతున్నారని మంత్రి గుమ్మనూరి జయరాం (Minister Jayaram) గురించి అన్నారు.జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు(Chandra Babu) గతంలో ఆరోపణలుచేశారని, అలాంటి వ్యక్తిని ఎందుకు టీడీపీలో చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఏపీలో ఓడిపోతామన్న భయంతోనే పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ (YS Jagan, ) పై రాజకీయ విమర్శలు చేయలేక గొడ్డలి పోటు అంటూ మాట్లాడుతు న్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ బీసీలకు 70శాతం పదవులు ఇచ్చారని, అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా సర్వేలు లేవని వెల్లడించారు.