అమరావతి : తిరుపతి(Tirupati) జిల్లా వడమాలపేటలో మూడేళ్ల బాలికపై (Girl) అత్యాచారం జరిగింది. వరుసకు మామ అయ్యే యువకుడు బాలికకు చాకెట్లు ఆశచూపి దారుణానికి పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం గ్రామంలోని స్కూల్ సమీపంలోకి తీసుకెళ్లి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఆమెను చంపివేశాడు.
తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు(Police) విచారణ ప్రారంభించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు (SP Subbaraidu) శనివారం వెల్లడించారు. క్లూస్‌ను సేకరించి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. కేసును ఫాస్ట్ ట్రాక్కోర్టులో గాని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కాగా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(Chandrababu) , హోం మంత్రి అనిత (Home Minister Anitha) స్పందించారు. ఈ సందర్భంగా ఘటనపై వారు విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేయాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.