అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu), ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) గురువారం మహారాష్ట్రలోని పలు ఆలయాలను దర్శించుకున్నారు. ముందుగా కొల్హాపూర్ (Kholhapoor) లోని మహాలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం షిర్టీ (Shiridi) కి వెళ్లి సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు.
షిర్డీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. దేశంలో పేదరికం పోవాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, ఇది రాజకీయాల ద్వారా, ప్రభుత్వాల ద్వారా సాధ్యమని అందుకు ఆశీర్వదించాలని బాబాను కోరుకున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో దానిని సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.