పట్టభద్రుల అభ్యర్థుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
Graduate candidates| ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎన్నికలకు టీడీపీ సమాయత్తం అవుతుంది . ఈ ఎన్నికలకు పార్టీశ్రేణులు సన్నద్ధం
అమరావతి : ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎన్నికలకు టీడీపీ సమాయత్తం అవుతుంది . ఈ ఎన్నికలకు పార్టీశ్రేణులు సన్నద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎన్నికలకు ఆయన అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. పశ్చిమ రాయలసీమకు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, తూర్పు రాయలసీమ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ పేరును ప్రకటించిన ఆయన విశాఖకు త్వరలో పేరు ప్రకటిస్తామన్నారు.
రానున్న ఎన్నికల్లో వస్తున్న పొత్తులపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పొత్తుల గురించి నేనెక్కడా మాట్లాడలేదని వివరించారు. పొత్తుల గురించి నాయకుల్లో స్పష్టత ఉండాలని సూచించారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వైసీపీ ప్రభుత్వం దుర్మర్గంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై నిలదీసిన వ్యక్తులను, పార్టీలను అణిచివేతకు గురిచేస్తుందని ఆరోపించారు. ప్రజలను ఏలే పాలకులకు విజన్ ఉండాలని, విద్వేషం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భయంకరంగా విధ్వంస పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

