AP News | ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్‌లు.. కేడర్ స్ట్రెంత్ పెంచుతూ కేంద్రం నిర్ణయం
AP News | ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్‌లు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు స్పందించిన కేంద్రం ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను పెంచింది. ప్రస్తుతం ఏపీకి 144 మంది ఐపీఎస్‌లు ఉండగా.. వారిని 174కు పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
AP News | ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్‌లు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు స్పందించిన కేంద్రం ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీకి 144 మంది ఐపీఎస్‌లు ఉండగా.. వారిని 174కు పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్‌గా 38 మంది ఐపీఎస్‌లను కేటాయించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్ రిజర్వ్‌గా 23 మందిని కేటాయించింది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎస్‌లను కేటాయించారు. కానీ అది రాష్ట్రానికి సరిపోలేదు. పైగా జగన్ సీఎంగా ఉన్న టైమ్‌లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. దీంతోపాటు నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైమ్ విభాగాల్లో పోలీసు అధికారుల కొరత తీవ్రంగా మారింది. దీంతో తమకు మరింత మంది ఐపీఎస్‌లను కేటాయించాలని జగన్ అప్పట్లో కేంద్రానికి లేఖ కూడా రాశారు. కానీ ఫలితం లేకపోయింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రంలో ఐపీఎస్‌ల కొరత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నాలుగైదు సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్ ఐపీఎస్‌లనే ఎస్పీలుగా నియమించాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల జిల్లాల్లో శాంతి భద్రతల సమస్యలతో పాటు పలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. చంద్రబాబు వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ప్రభుత్వం.. తాజాగా ఐపీఎస్‌ల సంఖ్యను పెంచింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

