అమరావతి : సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్‌బాబు (Mohan Babu) ఇంట కొనసాగుతున్న వివాదాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండడం తెలుగు రాష్ట్రాల్లో చర్చాంశనీయంగా మారింది.
రెండు రోజుల క్రితం మంచు మనోజ్ ( Manchu Manoj ) , తన భార్యతో కలిసి మోహన్‌బాబు వర్సిటీకి రాగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తనపై , భార్య మౌనికపై దాడులకు పాల్పడ్డారంటూ మంచు మనోజ్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా వర్సిటీలోకి చొచ్చుకు వచ్చేందుకు మనోజ్ ప్రయత్నించారని మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు పోలీసు స్టేషన్లో మరో ఫిర్యాదు చేశాడు.
దీంతో ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు ఇరువురిపై కేసు నమోదు (Cases Register) చేశారు. పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో నమోదైన కేసులో ఏ-1గా మనోజ్, ఏ-2గా మౌనిక, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మనోజ్ ఫిర్యాదు కేసులో ఏ-1గా విజయ్ సింహా, ఏ-2 గా సురేంద్ర, మరో 7గురిపై కేసులు నమోదు చేశామని వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్బాబుపైనా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.